epaper
Friday, January 16, 2026
spot_img
epaper

మేడారం మహాజాతరకు వేళాయే..ముస్తాబవుతున్న అమవార్ల గద్దెలు

క‌లం వెబ్ డెస్క్ : మేడారం జాతర(Medaram Mahajathara) తెలంగాణలోని ములుగు (Mulugu) జిల్లాలో జరిగే ఒక పెద్ద గిరిజన పండుగ. మేడారం జాతరలో సమ్మక్క-సారలక్కను దర్శించుకునేందుకు లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. కుంభమేళా తర్వాత భారతదేశంలో అతిపెద్ద పండుగగా పరిగణించబడుతుంది. తెలంగాణ కుంభమేళా(Telangana Kumbh Mela)గా పిలిచే ఈ మహా జాతర సమయంలో దేశం నలువైపుల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి రెండు గద్దెలను దర్శించుకుంటారు. ఉమ్మడి వరంగల్(Warangal) జిల్లా తాడ్వాయి మండంలోని ఓ మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య సమ్మక్క సారలమ్మలు గద్దెల రూపంలో కొలువై ఉన్నారు. జాతర సమయంలో దేశం నలువైపుల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్శించుకుంటారు.

ఇలాంటి ఈ మహా కుంభమేళాగా ప్రసిద్ధిచెందిన మేడారం మహాజాతర (Medaram Mahajathara) ముహూర్తం దగ్గరపడుతోంది. 2026 జనవరి 28 నుంచి నాలుగు రోజుల పాటు జాతర నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాతి కట్టడాలతో ఆదివాసీ గిరిజన సంప్రదాయలు ప్రతిబింబించే విధంగా గద్దెలు రూపుదిద్దుకుంటున్నాయి. జాతర కోసం అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మహాజాతరకు అధికారులు కోరినన్ని నిధులు ప్రభుత్వం మంజూరు చేసింది. జాతరకు వచ్చే భక్తులకు తాగునీరు అందించేందుకు, పారిశుద్ధ్య పనుల కోసం ప్రభుత్వం రూ.13కోట్లు మంజూరు చేసింది. జంపన్న వాగులో స్నాన ఘట్టాల మరమ్మతులు, ఇసుక చదును, జల్లు స్నానాల ఏర్పాట్ల కోసం రూ.5.90కోట్లు మంజూరు అయ్యాయి.

Read Also: గాంధీ పేరు తీసేస్తారా.. ఉపాధిహామీ స్కీం పేరు మార్పుపై కాంగ్రెస్ ఫైర్​

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>