మేడారం ఆదాయం రూ.13.25 కోట్లు

కలం, వరంగల్ బ్యూరో : మేడారం (Medaram) సమ్మక్క సారలమ్మ హుండీ ఆదాయం లెక్కింపు బుధవారంతో ముగిసింది. మొత్తం 828 హుండీలను 500 మంది సిబ్బంది లెక్కించారు. ఈ నెల 5వ తేదీ నుంచి హనుమకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాన మండపంలో లెక్కింపు చేపట్టారు. సుమారు వారం రోజుల పాటు హుండీలను లెక్కించగా మొత్తం రూ. 13,25,83,269 గా ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. గత జాతరలో రూ.13,25,22,511 కోట్లు రావడం గమనార్హం.

గతంతో పోలిస్తే ఈ జాతర కు (Medaram) అదనంగా రూ. 65 వేలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. 2024లో 540 హుండీలను ఏర్పాటు చేయగా ఈసారి అదనంగా 288 కలిపి మొత్తం 828 హుండీలను ఏర్పాటు చేశారు. అయితే, హుండీలు ఎక్కువగా ఏర్పాటు చేసినా ఆదాయం తగ్గిందని అధికారులు చెబతున్నారు.

Read Also: ఓడియ‌మ్మ బంటి.. మ‌హారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ వ‌ర‌కు టెర్ర‌ర్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>