కలం, కరీంనగర్ బ్యూరో: గిరిజన వనదేవతలు సమ్మక్క, సారలమ్మ జాతర (Medaram)కు తెలంగాణ రోడ్డు రవాణ సంస్థ టీఎస్ ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ నుంచి 700 బస్సులు నడిపించాలని నిర్ణయించింది. గతంలో నడిపించిన సర్వీసుల కంటే ఈ ఏడాది అదనంగా 70 బస్సులను నడిపించాలని నిర్ణయించారు. ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభమయ్యే మేడారం జాతరకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
700 బస్సులను కరీంనగర్ రీజియన్ పరిధిలోని కరీంనగర్, పెద్దపల్లి, మంథని, గోదావరిఖని, హుస్నాబాద్, హుజూరాబాద్ నుంచి మేడారంకు ప్రత్యేకంగా నడిపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 26వ తేదీ నుంచి జాతర కోసం ప్రత్యేక బస్సులు నడిపిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఇప్పటికే కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మేడారం జాతర (Medaram) యాత్రికులకు సైతం వర్తిస్తుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.


