కలం, మెదక్ బ్యూరో : మెదక్ జిల్లా తూప్రాన్ (Toopran) సివిల్ సప్లై గోదాం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బియ్యం బస్తాల తూకంలో భారీగా మోసం జరుగుతోందంటూ తూప్రాన్, మనోహరాబాద్, వెల్దుర్తి మండలాలకు చెందిన రేషన్ డీలర్లు గోదాం ఎదుట ఆందోళనకు దిగారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉండాల్సిన 50 కిలోల బస్తాల్లో, 2 నుండి 3 కిలోల వరకు బియ్యం తక్కువగా వస్తున్నాయని డీలర్లు ఆరోపిస్తున్నారు. గోదాం వద్ద పనిచేసే హమాలీలు కావాలనే బస్తాల్లో నుంచి బియ్యాన్ని తొలగించి, తూకంలో తేడాలు సృష్టిస్తున్నారని డీలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా, ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: వర్షపు జల్లుల్లో జలపాతాల జోరు.. తెలంగాణలో టాప్ వాటర్‌ఫాల్స్ ఇవే!
Follow Us On : WhatsApp

