Mobile Popup Ad
Mobile Popup Ad

మణుగూరులో ట్రాక్టర్ డ్రైవర్ల మెరుపు సమ్మె.. వేతనాలు పెంచాలని డిమాండ్

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా మణుగూరు (Manuguru) పట్టణంలో ట్రాక్టర్ డ్రైవర్లు మంగళవారం అకస్మాత్తుగా విధులను బహిష్కరించి మెరుపు సమ్మెకు దిగారు. ప్రస్తుత కాలంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా తమకు ఇస్తున్న వేతనాలు ఏమాత్రం సరిపోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

కుటుంబ పోషణ భారంగా మారిన నేపథ్యంలో, తమ రోజువారీ కనీస వేతనాన్ని రూ. 700కు పెంచాలని వారు యజమానులను డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు విధులకు హాజరయ్యే ప్రసక్తే లేదని డ్రైవర్లు ఈ సందర్భంగా భీష్మించుకు కూర్చున్నారు. డ్రైవర్ల సమ్మె కారణంగా మణుగూరు (Manuguru) పట్టణంలో ట్రాక్టర్ల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.

మున్సిపల్ పనులు, నిత్యావసరాల రవాణా, స్థానిక నిర్మాణ రంగ పనులపై ఈ ప్రభావం తీవ్రంగా పడినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై సంబంధిత ట్రాక్టర్ యజమానులు, అధికారులు వెంటనే స్పందించి, సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని డ్రైవర్లు కోరుతున్నారు. అధికారులు చొరవ చూపి తమకు న్యాయమైన వేతనం అందేలా చూడాలని, లేనిపక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

Read Also: కాంగ్రెస్ ‘సీక్రెట్’ సర్వే.. వారిపై స్పెషల్ ఫోకస్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>