సమ్మర్‌లో ఊరెళ్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

కలం మెదక్ బ్యూరో: మరికొన్ని రోజుల్లో వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవులు రాగానే అందరూ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తుంటారు. అటువంటి సమయంలో చోరీలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు (Medak SP Srinivasarao) తెలిపారు. ఊరికి వెళ్లే సమయంలో వీలైనంత వరకు ఇంట్లో విలువైన వస్తువులు, నగదు, బంగారు ఆభరణాలు పెట్టవద్దని జిల్లా వాసులను హెచ్చరిస్తున్నారు. వాటిని బ్యాంకు లాకర్‌లో లేదా భద్రంగా ఉన్న చోట దాచుకోవాలని వారు సూచిస్తున్నారు.

అంతే కాకుండా కాలనీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే దొంగలు భయపడే అవకాశం ఉందని, భద్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఊరికి వెళ్ళేటప్పుడు మీకు నమ్మకమైన వారికి, అలాగే స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని తెలిపారు. దొంగతనాల నియంత్రణ కోసం ప్రజలు నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు. అనుమానిత వ్యక్తుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని, ఎవరి మీదైనా అనుమానం వస్తే వెంటనే 100 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలని పోలీసులు (Medak SP) సూచించారు.

Read Also: బిల్లు ఆమోదం పొంద‌ద‌ని బీజేపీకి తెలుసు: రాహుల్ గాంధీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>