సైబర్ నేరగాళ్ల వలలో ప్రొఫెసర్.. కోటి రూపాయలు గోవిందా!

కలం, వెబ్ డెస్క్: వరంగల్‌లో (Warangal) నివాసం ఉంటున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) మాజీ ప్రొఫెసర్ సుధాకర్ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో (Cyber Scam) చిక్కుకున్నాడు. ఏకంగా రూ.కోటి రూపాయలు పోగొట్టుకున్నాడు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల (Stock Investment) ద్వారా అధిక లాభాలు గడించవచ్చనే ఆశతో ఆయన ఆన్‌లైన్‌లో సెర్చ్ చేశాడు. ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ లింక్ కనిపించింది. దానిని క్లిక్ చేసి తన వాట్సాప్ నెంబర్ ఇవ్వడంతో నేరగాళ్లు ‘H18’ అనే వాట్సాప్ గ్రూపులో చేర్చి నమ్మబలికారు.

ఆ గ్రూపులో కిరణ్ అనే వ్యక్తి కంపెనీ అకౌంట్స్ మేనేజర్‌గా పరిచయమై, భారీ లాభాలు వస్తాయని ప్రొఫెసర్‌ను నమ్మించారు. దీంతో ఆయన ఈ ఏడాది జనవరి 1 నుంచి వివిధ విడతల్లో నేరగాళ్లు సూచించిన బ్యాంకు ఖాతాలకు మొత్తం కోటి రూపాయలను బదిలీ చేశారు. చివరకు తాను మోసపోయానని గ్రహించాడు. బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read Also: పీఆర్సీ అంశంలో ఉద్యోగులకు మళ్ళీ నిరాశే !!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>