Mobile Popup Ad
Mobile Popup Ad

చీలపల్లి దోపిడీ కేసులో కీలక పురోగతి.. నిందితులు అరెస్ట్!

కలం, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం చీలపల్లిలో జరిగిన భారీ దోపిడీ కేసును మెదక్ పోలీసులు (Medak Police) ఛేదించారు. చీలపల్లి గ్రామంలో మే 14వ తేదీన రాత్రి సమయంలో తాళం వేసిన ఐదు ఇండ్లలో దుండగులు చోరీకి పాల్పడిన విషయం తెలిసిందే. తాళం పగలగొట్టి ఒక కిలో బంగారాన్ని, రెండున్నర కిలోల వెండిని దొంగిలించిన కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రెస్ మీట్ ద్వారా జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు వెల్లడించారు. మెదక్ పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాలు, సమాచార సేకరణ, గూఢచారి వ్యవస్థ ద్వారా ముమ్మర దర్యాప్తు చేపట్టారు. దొంగలను పట్టుకొని వారి వద్ద నుండి దొంగిలించబడిన మొత్తం సొత్తును రికవరీ చేశారు. ఈ భారీ చోరీకి పాల్పడిన నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు.

నిందితుల నుంచి సుమారు కిలో బంగారు ఆభరణాలు, 1.7 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం బిబ్యా నాయక్ తండాకు చెందిన జైరాం నాయక్, జాదవ్ ప్రధాన నిందితుడు, బావ ఇప్పు సింగ్(32) తో కలిసి దొంగతనాలు చేస్తుంటాడని తెలిపారు. దొంగిలించిన సొత్తును జైరాం తల్లి మాలి(80), చెల్లి సాంకి బాయి(28) కి ఇస్తే వారు దాచిపెట్టేవారు. ఈ నెల 14న చోరీ చేసిన కేసుపై అడ్వకేట్ తో మాట్లాడేందుకు వెళ్తుండగా రామాయంపేట్ వద్ద జైరాంని పట్టుకున్నారు పోలీసులు. నిందితులు జైరాం, జాదవ్, తల్లి మాలి బాయిని అరెస్ట్ చేయగా పరారీలో జైరాం బావ ఇప్పు సింగ్, చెల్లె సాంకి ఉన్నారు. నిందితులపై మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో మొత్తం 17 కేసులు ఉన్నట్లు తెలిపారు.

Read Also: న‌న్ను ఆయ‌న చెప్పుతో కొట్టాడు.. సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించిన‌ బండ్ల గ‌ణేష్!

Read Also: ఆమెకు రక్షణేది..?

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>