కలం, మెదక్ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మెదక్ బిజెపి (Medak BJP Protest) పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు. మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి హిందువుల దేవుళ్ళ గురించి మాట్లాడే అధికారం అర్హత లేదన్నారు.
ఎవరికి నచ్చిన దేవుడిని వారు కోల్చుకుంటారని, కాని ఇతర దేవుడి గురించి మాట్లాడే అధికారం లేదని స్పష్టం చేశారు. హిందూ దేవుళ్లను కించపరుస్తూ మాట్లాడుతున్న రేవంత్ పోయే రోజులు దగ్గర పడ్డాయని, హిందువుల జోలికి వస్తే ఖబర్దార్ అని హెచ్చరిoచారు. అదేవిధంగా దేశాన్ని నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అని విడదీస్తూ హిందూ మనోభావాలను దెబ్బతీస్తే రానున్న రోజుల్లో హిందువులంతా సంఘటమై రేవంత్ రెడ్డికి తగిన శాస్తి చేస్తారని వార్నింగ్ ఇచ్చారు.

