ఏపీలో స‌ర్ ప్ర‌క్రియ గ‌డువు పెంపు!

క‌లం, వెబ్‌డెస్క్: ఏపీలో స‌ర్‌ (SIR) ప్రక్రియకు సంబంధించిన గడువును భారత ఎన్నికల సంఘం (Election Commission) పొడిగించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 5లోపు క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారం పూర్తి చేసి అక్టోబర్ 9న తుది ఓటర్ల జాబితా విడుదల చేయాల్సి ఉంది. అయితే తాజా నిర్ణయంతో క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కార గడువును అక్టోబర్ 10 వరకు పొడిగించారు.

కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నో-మ్యాపింగ్, లాజికల్ డిస్క్రెపెన్సీ కేసుల విచారణలు, ఫారమ్-6, 7, 8 దరఖాస్తుల పెండింగ్‌ను దృష్టిలో ఉంచుకుని అర్హులైన ఏ ఓటరు కూడా జాబితా నుంచి పొరపాటున తొలగించబడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 16న రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచురించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>