కరీంనగర్‌ను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతాం: కొలగాని శ్రీనివాస్

కలం, కరీంగర్: కరీంనగర్ నగరపాలక సంస్థను రాష్ట్రంలో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు తమ పాలకవర్గం నిరంతరం కృషి చేస్తుందని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ (Kolagani Srinivas) స్పష్టం చేశారు. 29వ డివిజన్ కిసాన్ నగర్, మింగని వాడ ప్రాంతాల్లో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్ సోమిడి వేణు ప్రసాద్ తో కలిసి యూఐడీఎఫ్ నిధులు రూ.70 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు.

నగరంలోని 28, 29వ డివిజన్ల పరిధిలోని హనుమాన్ దేవాలయం సమీపంలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.56 లక్షలతో ప్రజలకు మెరుగైన తాగునీటి సరఫరా కోసం చేపట్టనున్న మంచినీటి పైప్‌లైన్ అభివృద్ధి పనులకు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. నగరంలోని ప్రతి డివిజన్‌లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు ప్రజలకు అవసరమైన రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యాలను కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో, వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లను మేయర్ ఆదేశించారు. నగర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం, ప్రజాప్రతినిధులు–అధికారుల సమన్వయంతో కరీంనగర్‌ను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో పలువురు కార్పొరేటర్లు ఏపీపీ చంద్ర, గాజా రమా శివరాం, ఎన్నం లక్ష్మీ ప్రకాష్, మున్సిపల్ అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది, కాంట్రాక్టర్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>