కలం, నిర్మల్: జిల్లాలో భూసమస్యలకు సంబంధించి అన్ని దరఖాస్తులను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. శనివారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో భూసంబంధిత దరఖాస్తుల పరిష్కారం, భూముల రీసర్వేపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మండలాల వారిగా పెండింగ్ లో ఉన్న భూభారతి, రెవెన్యూ సదస్సులు, సదాబైనమా, దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని అన్నారు. జిల్లాలో కొనసాగుతున్న భూముల రీసర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు.
సర్వే బృందం మొత్తం తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో ఉండాలన్నారు. ఈ సమావేశంలో ఇన్ ఛార్జ్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ రాకేష్, ఆర్డీవో దేవీదాస్, రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు పాల్గొన్నారు.

