కలం, నిజామాబాద్ బ్యూరో: తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (TUCI) ఆధ్వర్యంలో నిజామాబాద్ (Nizamabad) నగరంలోని పలు మున్సిపల్ సర్కిల్లల్లో 140వ మేడే (May Day) పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా నాయకులు డి.కిరణ్, ఎన్.రవికుమార్‌లు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకొచ్చిందని అన్నారు. కార్మిక హక్కులను, చట్టాలను రద్దుచేసి యాజమాన్యాలకు అనుకూలమైన చట్టాలు తేవడం సిగ్గుచేటని విమర్శించారు. వెంటనే లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మున్సిపల్ కార్మికులకు వేతనాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి అద్దెలు, పిల్లల చదువులకు వస్తున్న వేతనాలు ఏ మాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు రూ.26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. మేడే స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌ల రద్దుకై, కనీస వేతనాలు అమలు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు రాజేశ్వర్, విజయ్ కుమార్, శాంతి కుమార్, లక్ష్మీకాంత్, రాము, లక్ష్మణ్, శివ కుమార్, గంగాధర్, రమేష్, రాజు, శ్రీనివాస్, యాదమ్మ, శైలజ, లక్ష్మి, రాధా తదితరులు పాల్గొన్నారు.

