ప్రముఖ కవి తెలిదేవర ఇక లేరు

కలం, వెబ్ డెస్క్: ప్రముఖ కవి, రచయిత, సీనియర్ జర్నలిస్ట్ తెలిదేవర భానుమూర్తి (Telidevara Bhanumurthy) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. భానుమూర్తి 1953 జనవరి 16న భువనగిరిలో తెలిదేవర వెంకట్రావు, సీతమ్మ దంపతులకు జన్మించారు. యాదగిరిగుట్ట, ఆర్మూర్, భువనగిరిలో డిగ్రీదాకా చదువుకున్న తెలిదేవర.. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పట్టా అందుకున్నారు.

తొలిదశ తెలంగాణ ఉద్యమంలో..

1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తెలిదేవర చురుగ్గా పాల్గొన్నారు. ఆయన సమయంలో ఈయన జైలు జీవితం కూడా అనుభవించారు. అప్పటి నుంచే తెలంగాణ బాసలో కవితలు రాయడం మొదలు పెట్టారు. ఆ కవితలు ‘ఊరోళ్లు’ పేరుతో అరసం ప్రచురించింది. ఉదయం, వార్త, హెచ్ఎంటీవీ వంటి మీడియా సంస్థల్లో పనిచేశారు. ఉదయం దినపత్రికలో తెలంగాణ యాసలో  రాజకీయ వ్యంగ్య రచనలకు శ్రీకారం చుట్టాడు. ఎన్టీఆర్ ప్రభుత్వంపై, చంద్రబాబు ప్రభుత్వంపై వ్యంగ్యభాణాలు సంధించారు. ఆ రచనలు పలుకుబడి పేరుతో పుస్తకరూపంలో వెలువడ్డాయి. ఉదయం వారపత్రికలో ‘చల్నేదో బాల్ కిషన్ శీర్షికన ఇతడు రాసిన వ్యంగ్య, హాస్య రచనలు ఆదే పేరుతో విశాలాంధ్ర ప్రచురణాలయం పుస్తకంగా వెలువరించింది. ఆంధ్రప్రదేశ్ మాస పత్రికలో ఇతడు రాసిన హాస్య రచనలు గిల్లిదండ అనే పేరుతో పుస్తకంగా వచ్చింది. ఆక్సిజన్ బార్, నెమీక, గులేర్ అనే కథా సంపుటాలు ఇతని కలం నుంచి వెలువడ్డాయి. తెలంగాణ యాసలో రాసిన తొలి కవితా సంపుటి తొలిదేవర రచించిన ’ఊరోళ్లు‘ కావడం గమనార్హం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>