Mobile Popup Ad
Mobile Popup Ad

ములుగు జిల్లా ఏటూరునాగారం అడవుల్లో కార్చిచ్చు

కలం, వెబ్ డెస్క్ : ములుగు(Mulugu) జిల్లా ఏటూరునాగారం(Eturnagaram) అటవీ ప్రాంతంలో తీవ్ర కార్చిచ్చు చెలరేగింది. తాడ్వాయి, పస్రా, మేడారం అడవుల్లో మంటలు వేగంగా వ్యాపిస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఎండల తీవ్రత, గాలివేగం కారణంగా మంటలు అదుపు తప్పి విస్తృతంగా వ్యాపిస్తున్నట్లు సమాచారం. ఈ అగ్నిప్రమాదంలో వందలాది వృక్షాలు దగ్ధమవుతున్నాయి. దీనితో అటవీ సంపదకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడవుల్లో నివసించే వన్యప్రాణులు కూడా ప్రాణభయంతో పరుగులు తీస్తున్నాయి. ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి మంటలను ఆర్పాలని స్థానికులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>