కలం, వెబ్ డెస్క్: బాలినేని శ్రీనివాస్ రెడ్డి (Balineni Srinivasa Reddy) మళ్లీ వైసీపీలోకి వస్తున్నారన్న వార్తలు కొద్ది రోజులుగా హాట్ టాపిక్‌గా మారాయి. బుధవారం వైసీపీ నేతల సమావేశంలో జగన్ సైతం ఇదే మాట్లాడారు. వాసన్న మళ్లీ వస్తాడా అంటూ ఆరా తీశారు. తాజాగా తన పార్టీ మార్పు వార్తలపై బాలినేని క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియా, రాజకీయ వర్గాల్లో వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్ పెడుతూ బాలినేని ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. పవన్ కల్యాణ్‌తో తాను, తన కొడుకు ఉన్న ఫొటోను షేర్ చేస్తూ పవన్ నాయకుడు మాత్రమే కాదు నమ్మకం, ఆదరణ, ఆశ్రయం అని పేర్కొన్నారు. ఇందులో జనసేన పార్టీని, పవన్ కల్యాణ్‌ను ట్యాగ్ చేశారు. దీంతో పార్టీ మారే ప్రసక్తే లేదని బాలినేని చెప్పకనే చెప్పేశారు.
Read Also: ఆ ఐదేళ్లూ పండుగలు జరుపుకోలేని పరిస్థితి: CM చంద్రబాబు
Follow Us On: X(Twitter)

