పెట్రోల్ ట్యాంకర్ల నుంచి మంటలు..

కలం, వెబ్ డెస్క్ : జమ్మూలో (Jammu) భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం జమ్మూలో రద్దీగా ఉండే నర్వాల్ ప్రాంతంలో పెట్రోల్ ట్యాంకర్ల నుంచి మంటలు చెలరేగాయి. ఈ ఘటన (Oil Tanker Fire) లో మంటలు ఒక ట్యాంకర్ నుంచి ఐదు ట్రక్కులకు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పరిసరాలు మొత్తం దట్టమైన పొగతో కమ్మెసుకుపోయింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.  సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి.

ప్రస్తుతం మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా లేదా మరణించారా అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే, గతంలోనూ ఇలాంటి ఘటనలు (Oil Tanker Fire) ఈ ప్రాంతంలో చోటు చేసుకోవడం గమనార్హం. సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read Also: సమంత హెల్త్ సీక్రెట్స్ ఇవే.. ఉదయాన్నే ఇవి పాటించేయండి!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>