ఆలూరులో భారీ అగ్నిప్రమాదం.. క్షణాల్లో బూడిదైన వస్త్ర దుకాణం!

కలం, వెబ్ డెస్క్: కర్నూలు (Kurnool) జిల్లా ఆలూరు (Alur) పట్టణంలో భారీ అగ్నిప్రమాదం ( Fire Accident) చోటుచేసుకుంది. పట్టణంలోని మెయిన్ బజారులో గల వెంకటలక్ష్మి టెక్స్ టైల్స్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే ఈ మంటలు దుకాణమంతటా వేగంగా వ్యాపించాయి. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది స్థానికుల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు శ్రమించారు.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో దుకాణంలోని విలువైన వస్త్రాలు, ఇతర సామాగ్రి కళ్లముందే పూర్తిగా బూడిదవడంతో యజమాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు రూ. 3 కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో దుకాణంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>