Mobile Popup Ad
Mobile Popup Ad

చెన్నైలో భారీ అగ్ని ప్రమాదం.. ఆయిల్ కంపెనీలో పేలుళ్లు

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు రాజధాని చెన్నై (Chennai) సమీపంలోని మనలి ప్రాంతంలో ఉన్న ఓ ఆయిల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వరుసగా బాయిలర్లు పేలుతుండటంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో ఎనిమిది ఫైరింజన్లు రంగంలోకి దిగి మంటలు అదుపు చేస్తున్నాయి. పేలుడు ధాటికి భయపడి కార్మికులు పరుగులు తీశారరు. ప్రమాద సమయంలో కంపెనీలో లక్ష లీటర్లకు పైగా ఆయిల్ ఉన్నట్లు సమాచారం. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చుట్ట ప్రక్కల ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఘటన ఎలా సంభవించినే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>