Mobile Popup Ad
Mobile Popup Ad

కొంప ముంచిన స్టీరింగ్.. మార్కాపురం ప్రమాదంలో విస్తుపోయే నిజాలు

కలం, వెబ్ డెస్క్ : మార్కాపురం బస్సు ప్రమాదం (Bus Accident) ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. తల్లిదండ్రులకు పిల్లల్ని దూరం చేసింది. ఈ బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు 14 మంది చనిపోయారు. అయితే తాజాగా ఈ బస్సు ప్రమాదం (Bus Accident) గురించి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ బస్సు జగిత్యాల నుంచి బయలు దేరిన కొద్ది సేపటికే మొరాయించడం ప్రారంభించిందంట. బస్సులో సమస్య ఉందని.. సరిగ్గా నడవట్లేదని ప్రయాణికులు బస్సు డ్రైవర్ ను, సిబ్బందిని అలర్ట్ చేశారు.

దీంతో సుర్రగొండపాలెం వద్ద బస్సును దాదాపు గంటసేపు ఆపేసి మరమ్మతులు చేశారు బస్సు సిబ్బంది. మళ్లీ జర్నీ స్టార్ట్ చేసిన కొద్ది సేపటికే రాయపురం సమీపంలో టిప్పర్ ను ఢీకొట్టింది. అయితే టిప్పర్ ను ఢీకొట్టే సమయంలో స్టీరింగ్ సమస్య తలెత్తినట్టు విచారణలో డ్రైవర్ చెప్పారంట. బస్సు స్టీరింగ్ జామ్ అవడం వల్లే టిప్పర్ నుంచి బస్సును తప్పించలేకపోయానని డ్రైవర్ చెప్పినట్టు తెలుస్తోంది. అంటే బస్సు కండీషన్ లో లేకపోయినా నడుపుతున్నారని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>