కలం, వెబ్ డెస్క్ : రాకింగ్ స్టార్ మంచు మనోజ్ (Manchu Manoj) హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం ‘డేవిడ్ రెడ్డి ‘ టీమ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ సినిమాకు పనిచేస్తున్న డీఓపీ టీమ్ మెంబర్ లక్ష్మణ్ రావు అనుమానస్పద స్థితిలో మరణించారు. ఈ విషయం తెలిసి మంచు మనోజో ట్విట్టర్ లో సంచలన పోస్ట్ చేశారు. లక్ష్మణ్ రావు మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఎమోషనల్ అవుతూ ఈ మిస్టరీ డెత్ కేసులో నిజాలను వెలికితీయాలని మంచు మనోజ్ కోరారు.
ఈ మేరకు కేసు దర్యాప్తు పారదర్శకంగా జరగాలని కోరుతూ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల డీజీపీలను మనోజ్ తన ట్వీట్ లో ట్యాగ్ చేశారు. ఈ సందర్భంగా తన టీమ్ మెంబర్ మరణం వెనుక ఎవరున్నా.. నిందితులు ఎవరైనా సరే చట్టం ముందు నిలబెట్టాలని, శిక్ష పడకుండా వారు తప్పించుకోకూడదని డిమాండ్ చేశారు. డీఓపీ లక్ష్మణ్ రావు మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ మంచు మనోజ్ చేసిన తాజా ట్వీట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

