లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవాల్లో పాల్గొన్న మానాల మోహన్ రెడ్డి

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లా కమ్మర్‌పల్లి మండలం నల్లూరు గ్రామంలో ఘనంగా లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవాలలో రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి (Manala Mohan Reddy) పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ.. లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వం పై ఉండాలని, రాష్ట్ర ప్రజలు పాడి పంటలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్మరపల్లి మండల ప్రెసిడెంట్ సుకెట రవి, బుచ్చి మల్లయ్య, నలూరు ఉపసర్పంచ్ ప్రసాద్, రాజేంద్రనగర్ సర్పంచ్ ప్రవీణ్, కొత్తూరు ధ్యాగ నర్సారెడ్డి, తీపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మునీర్, రమేష్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read Also: మరో సకల జనుల సమ్మెగా ఆర్టీసీ సమ్మె..TGSRTC ప్రకటన

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>