కలం, వెబ్ డెస్క్ : బెంగళూరులోని (Bengaluru) ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్‌లో గవర్నర్ కాన్వాయ్ (Governor Convoy) కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయిన ఘటనపై ఓ వ్యక్తి ఆగ్రహంతో రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపాడు. గర్భిణీ భార్యతో కలిసి ప్రయాణిస్తున్న ఆ వ్యక్తి, దీర్ఘకాలంగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో తీవ్ర అసహనానికి గురయ్యాడు.
కారు లోపల భార్య ఉండగానే, ఆ వ్యక్తి వాహనం నుంచి బయటకు వచ్చి రోడ్డుపై కూర్చుని నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీఐపీ కాన్వాయ్‌ల కారణంగా సాధారణ ప్రజలకు ఎదురవుతున్న ట్రాఫిక్ ఇబ్బందులపై మరోసారి చర్చకు దారితీసింది. అధికారులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై దృష్టి పెట్టాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
-బెంగళూరులో గవర్నర్ కాన్వాయ్‌తో ట్రాఫిక్ జామ్
-ఓ వ్యక్తి ఆగ్రహంతో రోడ్డుపై కూర్చుని నిరసన
Man Sits on Bengaluru Road as Governor’s Convoy Halts Traffic with Pregnant Wife Inside Car!”#BengaluruTraffic #VIPConvoy #CommonManProtest #ViralVideo #Kalam #KalamDaily #KalamTelugu pic.twitter.com/IZ9IWq3Tbh— Kalam Daily (@kalamtelugu) June 1, 2026
Read Also: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేపు TGPSC నుంచి 3 నోటిఫికేషన్లు
Follow Us On : WhatsApp

