కలం, వెబ్ డెస్క్: ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు (Ayyanna Patrudu) కీలక వ్యాఖ్యలు చేశారు. కలియుగ వైకుంఠం తిరుమలపై కొలువైన వేంకటేశ్వర స్వామివారిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ ఏడుకొండల స్వామి ఆశీస్సులు, దివ్య ఆశీర్వాదాలు రాష్ట్ర ప్రజలందరిపైనా ఎల్లప్పుడూ ఉండాలని కోరినట్లు తెలిపారు. అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆ స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. తన తర్వాత తన కుటుంబానికి కూడా టీడీపీ పార్టీకి సేవ చేసే అవకాశం ఇవ్వాలని అభిలషించారు.
25 ఏళ్ల వయస్సు నుంచి టీడీపీలో సేవలందిస్తున్నానని.. పార్టీ కోసం జీవితాంతం పనిచేశానని భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ ఎన్నికల వేళ అయ్యన్న వ్యాఖ్యలకు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీలో రాజ్యసభ ఆశావహుల మధ్య హాట్ టాపిక్‌గా అయ్యన్న (Ayyanna Patrudu) వ్యాఖ్యలు మారాయి.
Read Also: బెంగళూరులో వీఐపీ మూమెంట్ కలకలం.. వ్యక్తి నిరసన వైరల్
Follow Us On : WhatsApp

