కలం, రఘునాథపల్లి: జనగామ జిల్లాలోని రఘునాథపల్లి మండలం బానాజీపేట (Banajipet) గ్రామంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. మెయిన్ రోడ్డు సమీపంలోని ఫ్యాక్టరీ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని వరంగల్ జిల్లా కరీంబాద్‌కు చెందిన కొల్పుల కుమారస్వామి (50)గా గుర్తించారు. తన కూతుర్ని తీసుకొని బంధువుల ఇంటికి వచ్చి వెళుతుండగా మార్గమధ్యంలో ఈ ప్రమాదం జరిగింది. కుమారస్వామి తలకు తీవ్ర గాయమైంది. ఆయనను జనగామ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
Read Also: ఈటలపై దుష్ప్రచారం.. బీజేపీ చీఫ్ రియాక్షన్
Follow Us On : WhatsApp

