కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) కు రాజ్యసభ ఎంపీ సీటు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. త్వరలో కర్ణాటకలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతుండగా.. మెజార్టీ ప్రకారం, ఇవి కాంగ్రెక్ పార్టీకే దక్కనున్నాయి. ఇందులో ఒక స్థానాన్ని షర్మిలకు కేటాయించినట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తన సన్నిహిత వర్గాలతో చెప్పినట్లు జాతీయ మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. కర్ణాటక నుండి రాజ్యసభ సభ్యుడు ఆ రాష్ట్రానికి చెందినవారే ఉండాలని కొందరు నాయకులు వ్యతిరేకించినప్పటికీ షర్మిల నామినేషన్ ఖరారైనట్లు తెలుస్తోంది.
షర్మిలకు రాహుల్ గాంధీ హామీ..
2024లో జరిగిన ఏపీ ఎన్నికల ముందు షర్మిల పార్టీలో చేరినప్పుడు ఆమెను పెద్దల సభకు పంపిస్తానని రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఆ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ తరుఫున కడప లోక్‌సభ నియోజవర్గం నుంచి పోలీ చేసి ఓడిపోయారు. దీంతో ఆమెకు ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ ఆదేశాలతో కర్ణాటక నుంచి షర్మిలను పెద్దల సభకు పంపనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై షర్మిల ఇటీవల రాహుల్ గాంధీని కలిశారనే సంగతి తెలిసిందే. అంతేకాదు కర్ణాటక సీఎం పీఠాన్ని అధిష్టించనున్న డీకే శివకుమార్ కుటుంబంతో షర్మిలకు మంచి సాన్నిహిత్యం ఉందని.. ఆయన కూడా షర్మిలను రాజ్యసభ ఎంపీగా నియమించేందుకు కాంగ్రెస్ హైకమండ్ కు సిఫార్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

