ఎర్రవల్లిలో వ్య‌వ‌సాయ ప‌నుల్లో మాజీ సీఎం కేసీఆర్

క‌లం, వెబ్‌ డెస్క్‌: ఫోన్‌ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) మాజీ సీఎం కేసీఆర్‌కు (KCR) సిట్ (SIT) నోటీసులు ఇచ్చిన వేళ ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. ఆయ‌న ఫామ్‌హౌస్‌లో వ్య‌వ‌సాయ ప‌నులు ప‌ర్య‌వేక్షిస్తున్న ఫోటోలు తాజాగా వైర‌ల్ అవుతున్నాయి. ఆదివారం నందిన‌గ‌ర్ నివాసంలో కేసీఆర్‌ను విచారిస్తామ‌ని నోటీసుల్లో సిట్ స్ప‌ష్టం చేసింది. అయితే ఇప్ప‌డు కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో ఉన్న ఫోటోలు వైర‌ల్ అవుతుండ‌టంతో ఆయ‌న‌ను ఫామ్‌హౌస్‌లోనే విచార‌ణ చేయాల‌ని సిట్‌కు బ‌దులివ్వ‌నున్నార‌న్న ఊహాగానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మ‌రోవైపు కేసీఆర్‌కు (KCR) సిట్ అధికారులు పంపించిన నోటీసులు చెల్ల‌వ‌ని బీఆర్ఎస్ నేత‌లు పేర్కొంటున్నారు. ఇదే అంశంపై న్యాయవాదులతో కేసీఆర్ చ‌ర్చిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో అస‌లు రేపు కేసీఆర్ విచార‌ణ జ‌రుగుతుందా? లేదా? అనే దానిపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

Read Also: తల్లిదండ్రుల మిస్సింగ్ కేసులో షాకింగ్ నిజాలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>