కలం, వెబ్ డెస్క్ : కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ (Kagaznagar) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS)లో బుధవారం ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. పాఠశాల వంటగదిలో గ్యాస్ సిలిండర్ లీక్ అవ్వంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు వ్యాపించడంతో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ఘటనపై సమచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో పాఠశాలలో సుమారు 450 మంది విద్యార్థులు ఉన్నారు. ఉపాధ్యాయులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి విద్యార్థులను వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించడంతో భారీ ప్రమాదం తప్పినట్లయింది.

