మణుగూరులో విషాదం.. భార్యతో గొడవ, గడ్డి మందు తాగిన తండ్రీకొడుకులు

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు (Manuguru) మండలం బాంబే కాలనీ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. నాగేశ్వరరావు అనే వ్యక్తి తన భార్యతో గొడవపడి గడ్డి మందు తాగాడు. కుమారుడికి కూడా తాగించి ఆత్మహత్య యత్నం (Suicide) చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. జూలూర్ పాడ్ గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, నందిని దంపతులకు ఇద్దరు పిల్లలు. భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఆదివారం రామనుజవరంలో (అత్తగారి ఇల్లు) గొడవ జరగడంతో నాగేశ్వరరావు ఇద్దరు పిల్లల్ని తీసుకుని మణుగూరుకు వెళ్లాడు. తీవ్ర మనస్తాపంతో ఆయన గడ్డి మందు తాగాడు.

తన ఇద్దరు పిల్లలకు కూడా తాగించే ప్రయత్నం చేశాడు. ముందుగా కుమారుడుకి పోసి తర్వాత కూతురికి తాగించే ప్రయత్నంలో నాగేశ్వరరావు కింద పడిపోయాడు. ఇంటి యజమాని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నాగేశ్వరరావు, కుమారుడిని భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>