Mobile Popup Ad
Mobile Popup Ad

ఎగ్జిట్ పోల్స్ అన్ని బూటకమే.. మళ్లీ మా సర్కారే!: దీదీ

కలం, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఫలితాల్లో సంచలనం నమోదు అవుతుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. 2011 నాటి నుంచి హ్యాట్రిక్ విజయాన్ని సాధించిన మమతా బెనర్జీ ప్రభుత్వం ఈ సారి దిగిపోక తప్పదని చెప్పాయి. ఈ సారి పశ్చిమ బెంగాల్ లో కమలం వికసించబోతుందని వెల్లడించాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అన్ని బూటకమేనని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (దీదీ) (Mamata Banerjee) మండిపడ్డారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీ కార్యాలయం నుంచి వచ్చిన సర్క్యులర్ల ప్రకారం రూపొందించిన పెయిడ్ పోల్స్ అని విమర్శించారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర బలగాలను వాడి బీజేపీ అడ్డంకులు సృష్టించిందని మమతా బెనర్జీ (Mamata Banerjee) ఆరోపించారు. అయినప్పటికీ ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 226 సీట్లను దాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. పెయిడ్ పోల్స్ ను చూసి కార్యకర్తలు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. “మా, మాతీ, మనుష్” అనే నినాదంతో నాలుగోసారి అధికారంలోకి రాబోతున్నామని తేల్చి చెప్పారు. అయితే కౌంటింగ్ కేంద్రా వద్ద అభ్యర్థులు , కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read Also: వినేష్ ఫోగట్ సెకండ్ ఇన్నింగ్స్.. కొత్త వెయిట్ కేటగిరీతో సిద్ధం!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>