Mobile Popup Ad
Mobile Popup Ad

సిటిజన్ సెంట్రిక్ సిస్టమ్‌.. ఇంటి వద్దే ఫిర్యాదు నమోదు

కలం, మెదక్ బ్యూరో : ప్రజలకు అనుకూలమైన పోలీసింగ్ సేవలను మరింత సులభతరం చేసేందుకు , బాధితులకు త్వరగా న్యాయం అందించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సీఐడీ శాఖ కొత్తగా సిటిజన్ సెంట్రిక్ సిస్టమ్‌ (Citizen Centric System)ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ విధానం ద్వారా ముఖ్యంగా పోక్సో కేసులు, మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు వంటి సున్నితమైన కేసుల్లో, బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా తమ నివాసం లేదా తమకు అనుకూలమైన ప్రదేశంలోనే ఫిర్యాదు నమోదు చేసుకునే సౌకర్యం కల్పించారు.

ఈ కొత్త సిటిజన్ సెంట్రిక్ సిస్టమ్‌ (Citizen Centric System) ద్వారా మెదక్ (Medak) జిల్లా రేగోడ్ మండలంలో జరిగిన ఒక హత్య కేసులో బాధితురాలి నివాసంలోనే ఫిర్యాదు స్వీకరించారు పోలీసులు. సీఐ పీ రేణుక రెడ్డి, రేగోడ్ పోలీస్ స్టేషన్‌ ఎస్‌ఐ పోచయ్య బాధితురాలి ఇంటికి వెళ్లి ఫిర్యాదును నమోదు చేశారు.

Read Also: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య స్నేహబంధం: బీజేపీ చీఫ్ రామచందర్ రావు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>