Mobile Popup Ad
Mobile Popup Ad

బక్రీద్‎ను శాంతియుతంగా జరుపుకోవాలి : మల్కాజ్‎గిరి సీపీ సుమతి

కలం, క్రైమ్ బ్యూరో : బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని మల్కాజ్‎గిరి పోలీస్ కమిషనర్ సుమతి (Malkajgiri CP sumathi) అన్నారు. ఆదివారం నేరేడ్మెట్ సీపీ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులు, ముస్లిం, గోరక్షక్ సభ్యులతో విడివిడిగా సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సుమతి మాట్లాడుతూ, బక్రీద్ వంటి ముఖ్యమైన పండుగలను పరస్పర సహకారంతో జరుపుకోవడం సమాజంలో ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. ఎలాంటి అపోహలు, వదంతులు వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా వచ్చే అసత్య ప్రచారాలను నమ్మ వద్దని కోరారు. అనుమానాస్పద వాహనాలు, అక్రమరవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై సమాచారం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని హెచ్చరించారు.

గోవులను తరలించే వాహనాలను అడ్డుకోవడం, వ్యక్తులపై దాడులు చేయడం, బలవంతంగా తనిఖీలు చేయడం వంటి చర్యలు పాల్పడరాదని గో రక్షక్ సభ్యులను సూచించారు. ఎలాంటి అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రభుత్వం అనుమతించిన ప్రదేశంలోనే జంతువద నిర్వహించాలని, బహిరంగ ప్రదేశాలలో జంతు అవశేషాలు ఉంచకుండా పరిశుభ్రత పాటిస్తూ మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ అనురాధ, మల్కాజ్‎గిరి డీసీపీ సీహెచ్ శ్రీధర్, ఉప్పల్ డీసీపీ సురేశ్, ఎస్బీ డీసీపీ నరసింహరెడ్డి, విమెన్ సేఫ్టీ డీసీపీ ఉషారాణి, అడ్మిన్ డీసీపీ ఇందిరా, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>