Mobile Popup Ad
Mobile Popup Ad

ఆలయంలో భారీ చోరీ.. న‌గ‌లు, డ‌బ్బు మాయం!

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా రామచంద్రాపురం అశోక్ నగర్‌లోని ఆలయంలో భారీ చోరీ జరిగింది. అశోక్ నగర్ ముంబై జాతీయ రహదారికి స‌మీపంలో ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. స్వామి వారికి చెందిన 6 తులాల బంగారం, 8 కిలోల వెండితో పాటు 90 వేల వరకు నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. ఆలయ కమిటీ సభ్యులు రామచంద్రాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేప‌ట్టారు. క్లూస్ టీం ఆలయానికి చేరుకొని ఆధారాలు సేకరించింది.

Read Also: కృత్రిమ కొరతకు అడ్డుకట్ట: కేంద్రం కీలక నిర్ణయం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>