కలం, వెబ్ డెస్క్: ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన ఓ యువతికి సినీ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) అండగా నిలిచారు. ప్రతి నెల ఆమెకు ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఇటీవల కాకినాడ జిల్లా వేట్లపాలెం (Vetalapalem)లో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో దుర్గ అనే అమ్మాయి తన తండ్రిని కోల్పోయింది. దుర్గ అనే మానసిక దివ్యాంగురాలు. దీంతో ఆమెను ఎవరైనా ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు. అభిమానుల ద్వారా విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ దుర్గ పోషణ బాధ్యతలు స్వీకరించేందుకు ముందుకొచ్చారు.
దుర్గ పోషణ, ఇతర అవసరాల కోసం ప్రతి నెలా రూ.7,500 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తానని చెప్పారు. ఈ మేరకు వేట్లపాలెం వెళ్లిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు దుర్గను కలిసి విషయాన్ని తెలియజేశారు. అల్లు అర్జున్ (Allu Arjun) చేసిన మంచి పనికి సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Read Also: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు
Follow Us On : WhatsApp

