Mobile Popup Ad
Mobile Popup Ad

దుర్గాదేవి ఆలయంలో భారీ చోరీ

కలం, వెబ్‌డెస్క్: అల్లూరి సీతారామరాజు (Alluri Sitharama Raju) జిల్లా పాడేరు (Paderu) లోని దుర్గాదేవి ఆలయంలో భారీ చోరీ జరిగింది. దుండగులు ఆలయ తలుపులు పగులగొట్టి ఆలయం లోపలికి ప్రవేశించారు. సుమారు రూ.8 లక్షల విలువైన వెండి, బంగారు ఆభరణాలను అపహరించారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో చోరీలు పెరుగుతున్నాయి. దేవాలయాల్లో హుండీలు, ఆభరణాలు, విగ్రహాల చోరీల ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇవేకాకుండా మహిళల మెడలో గొలుసు చోరీ ఘటనలు కూడా తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బైక్ పై వచ్చే దొంగలు నడుచుకుంటూ వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>