పాలమూరు రోడ్లకు మహర్దశ.. రేపు మంత్రుల శంకుస్థాపన

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ (Mahabubnagar) జిల్లా రోడ్దకు మహర్దశ పట్టనుంది. రూ.1,775.51 కోట్ల అంచనాతో చేపట్టనున్న రహదారుల విస్తరణ, మరమ్మతులకు (Road Expansion Projects) రేపు రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేయనున్నారు.

నాలుగు ప్యాకేజీలుగా పనులు..

హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ (హ్యామ్‌) ఫేజ్‌-1 కింద నాలుగు ప్యాకేజీలుగా చేపట్టే పనులకు ఇద్దరు మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 9 గంటలకు నారాయణపేట జిల్లా మక్తల్‌లో రూ.573 కోట్లతో ఒకటో ప్యాకేజీ, గద్వాల జిల్లా ధరూర్‌ మండలంలో గద్వాల–రాయచూర్‌ రహదారిపై రూ.339.39 కోట్లతో రెండో ప్యాకేజీ పనులకు భూమి పూజ చేయనున్నారు.

మధ్యాహ్నం వనపర్తి జిల్లా జడ్చర్ల రోడ్డులో రూ.359.09 కోట్లతో వనపర్తి-2 ప్యాకేజీ, అనంతరం కొల్లాపూర్‌ నియోజకవర్గం ఎల్లూరు గ్రామం వద్ద కొల్లాపూర్‌–మొలచింతలపల్లి మార్గంలో రూ.504.03 కోట్లతో వనపర్తి-1 ప్యాకేజీ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

Read Also: కొండా మురళి పెద్దపులి.. నవీన్ రాజ్ చిన్నపులి: కొండా సురేఖ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>