మహబూబ్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం

కలం, వెబ్‌బెస్క్: మహబూబ్‌నగర్‌ (Mahabubnagar) జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం (fire accident) చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున పట్టణంలోని పిస్తా బంక్వెట్ హాల్‌ (Pista banquet hall) లో భారీగా చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగ, మంటలు భవనాన్ని ఆవరించాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు.

స్పందించిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు నమోదు కాలేదని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>