Mobile Popup Ad
Mobile Popup Ad

మదీనా చౌరస్తాలో భారీ అగ్ని ప్రమాదం!

కలం, వెబ్‌ డెస్క్‌ : హైదరాబాద్ నగరంలోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన మదీనా చౌరస్తా (Madina Circle)లో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడి ఒక ప్రముఖ బట్టల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే ఈ మంటలు దుకాణం మొత్తానికి వ్యాపించాయి. ప్రమాద తీవ్రత కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. స్థానికులు, వ్యాపారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు.

నగరంలోని ఎనిమిది వేర్వేరు అగ్నిమాపక కేంద్రాల నుండి ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. రెండు గంటలుగా సిబ్బంది మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఎదురవుతోంది. మరోవైపు పోలీసులు అప్రమత్తమై సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాద స్థలానికి సమీపంలో ఉన్న పరిసర ప్రాంతాల ప్రజలను, మిగిలిన దుకాణాల సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు ఖాళీ చేయిస్తున్నారు. మదీనా చౌరస్తా వైపు వచ్చే రహదారులను తాత్కాలికంగా మూసివేసి ట్రాఫిక్‌ను మళ్లించారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>