సంగారెడ్డిలో భారీగా గంజాయి పట్టివేత

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి(Sangareddy) జిల్లాలో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. సుమారు రూ.2.87 కోట్ల విలువైన 574 కిలోల ఎండు గంజాయిని సీసీఎస్, ఎస్ న్యాబ్, సదాశివపేట పోలీసులు సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో సదాశివపేట నుంచి సంగారెడ్డి వైపు వస్తున్న ఒక కియా కారును పోలీసులు ఆపి తనిఖీ చేశారు. ఆ కారుకు వెనుక వస్తున్న డీసీఎంను కూడా పరిశీలించగా, అందులో పెద్ద ఎత్తున గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు.

ఎండు గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి తరలిస్తున్న ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. మొత్తం 286 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకొని, కియా కారు, డీసీఎంను సీజ్ చేశారు. ఈ గంజాయి సరఫరాలో భాగమైన మహారాష్ట్ర(Maharashtra) కు చెందిన ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>