రాజమండ్రిలో చారిత్రక వేడుక.. విజయవాడలో మంత్రులతో సీఎం భేటీ!

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) శనివారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం, ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి అధికారిక షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది.

ఉదయం 9.30 గంటలకు అమరావతిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి, 10.00 గంటలకు రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మంజీరా సరోవర్ ప్రీమియర్ హోటల్‌కు వెళ్లి, ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.05 గంటల వరకు నిర్వహించే రాజమహేంద్రవరం జిల్లా కోర్టు 222 ఏళ్ల వేడుకలు, బార్ అసోసియేషన్ 131 ఏళ్ల సంయుక్త వార్షికోత్సవ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ చారిత్రక కార్యక్రమంలో పలువురు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు కూడా పాలుపంచుకోనున్నారు.

మధ్యాహ్నం కార్యక్రమం ముగిసిన తర్వాత రాజమహేంద్రవరం నుంచి తిరుగుపయనమై 1.45 గంటలకు అమరావతిలోని క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. అనంతరం సాయంత్రం విజయవాడలోని బెరమ్ పార్క్‌లో రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు ప్రత్యేక డిన్నర్ మీట్‌లో పాల్గొననున్నారు. రాష్ట్ర పరిపాలన, అభివృద్ధి అంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>