Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ విద్యా వ్యవస్థలో భారీగా మార్పులు!

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ (Telangana) విద్యా వ్యవస్థలో భారీ మార్పులు రాబోతున్నాయి. ఇప్పటివరకు డిగ్రీ స్థాయిలో ఉన్న సెమిస్టర్ విధానాన్ని ఇక నుంచి పాఠశాలల్లో కూడా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు విద్యా విధానం కమిటీ సీరియస్‌గా పరిశీలిస్తోంది. దీని ప్రకారం, 9వ తరగతి నుంచే సెమిస్టర్ విధానం అమలు చేయనున్నారు. ఏడాదికి రెండు సార్లు పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఒక్కో సెమిస్టర్‌లో 5 సబ్జెక్టులు మాత్రమే ఉండేలా కరిక్యులమ్ డిజైన్ చేస్తున్నారు. 9వ తరగతి నుంచి ఇక అన్ని రకాల కోర్సులు, తరగతులకు ఇది వర్తింపజేయబోతున్నారు. త్వరలోనే దీని ముసాయిదా విడుదల కాబోతుంది. అభిప్రాయాల అనంతరం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే..

విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడమే లక్ష్యంగా ఈ సెమిస్టర్ విధానానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది. ఏడాదికోసారి మాత్రమే పరీక్షలు జరగడం వలన కొందరు విద్యార్థులు చివరి వరకు చదవకుండా అలసత్వంగా ఉండటం, తీరా పరీక్షల్లో సరిగా మార్కులు రాకపోవడంతో ఆత్మహత్యల వంటివి చేసుకోవడం చర్చనీయాంశంగా మారుతున్నాయి. దీన్ని నివారించడానికే, ప్రతి ఆరు నెలలకు పరీక్షలు పెట్టాలని నిర్ణయించారు. తద్వారా, విద్యార్థుల్లో చదవాలనే ఉత్సాహంతో పాటు ఒక సెమిస్టర్‌లో బాగా మార్కులు రాకపోతే.. మరో సెమిస్టరులో మంచి మార్కులు సాధించుకునేలా చదువుతారని ప్రభుత్వం భావిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>