పార్లమెంట్ ముందు మంత్రి సూపర్ డాన్స్.. వీడియో వైరల్

కలం, వెబ్ డెస్క్ : హంగేరీ (Hungary) లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన సమయంలో ఆ దేశ మంత్రి చేసిన డ్యాన్స్ సంచలనంగా మారింది. ప్రధానమంత్రిగా పీటర్ మాగ్యార్ ప్రమాణ స్వీకారం అనంతరం పార్లమెంట్ ముందు నిర్వహించిన సభలో ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టబోయే ప్రముఖ నాయకుడు జోల్ట్ హెగెడస్ డ్యాన్స్ చేశారు. కొస్సూత్ స్వేర్ లో ఉన్న పార్లమెంట్ మెట్లపై వేలాది మంది ముందు ఆయన చేసిన నృత్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది.

ప్రోటోకాల్ ను పక్కనపెట్టి ఉత్సాహంగా విజయోత్సవాల్లో పాల్గొన్నారు. హెగడస్ తో పాటు కొత్త మంత్రివర్గంలోని కీలక సభ్యులు కూడా చిందేశారు. కాగా, జోల్డ్ హెగెడస్ డ్యాన్సింగ్ పొలిటీషియన్ గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. తాను ఎంపీగా గెలిచిన ఏప్రిల్ 12 వ తేదీన కూడా బత్తియానీ స్వ్కేర్ లో తొలిసారి డ్యాన్స్ చేసి ప్రజలను ఉత్సాహ పరిచారు. తాజాగా ఇప్పుడు పార్లమెంట్ మెట్లపై మరోసారి హెగెడస్ తన నృత్యాన్ని ప్రదర్శించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>