Mobile Popup Ad
Mobile Popup Ad

మహబూబ్‌నగర్‌లో గోవుల అక్రమ రవాణా నిషేధం

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో :  బక్రీద్ (Bakrid) పండుగ నేపథ్యంలో గోవుల అక్రమ రవాణాను పూర్తిగా నిషేధిస్తున్నట్లు జిల్లా ఎస్పీ డి. జానకి(SP Janaki) తెలిపారు. ఇతర జిల్లాల నుండి మహబూబ్‌నగర్ (Mahabubnagar) పట్టణంలోకి వచ్చే అన్ని వాహనాలను కట్టుదిట్టంగా తనిఖీ చేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. గోవుల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఈ ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ అప్పయ్య కోయిలకొండ ఎక్స్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్‌పోస్ట్‌ను సందర్శించి తనిఖీలు నిర్వహించారు.

చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఎలాంటి అనుమానాస్పద వాహనాలైనా పూర్తిగా తనిఖీ చేయాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు అక్రమ రవాణా నివారణకు పోలీస్ శాఖ, పశుసంవర్ధక శాఖ, రెవెన్యూ శాఖల సమన్వయంతో ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

 Read Also: తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌పై మహారాష్ట్ర సీఎంకు రేవంత్‌ లేఖ

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>