Mobile Popup Ad
Mobile Popup Ad

పంట అవశేషాలు కాల్చొద్దు.. రైతులకు వ్యవసాయ శాఖ కీలక సూచన

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: పంట కోత అనంతరం పొలాలలో మిగిలిన వరి, ఇతర పంట అవశేషాలను కాల్చివేయడం (Stubble Burning) వల్ల పర్యావరణ కాలుష్యం పెరగడమే కాకుండా భూమి సారవంతం కూడా తగ్గిపోతుందని మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా వ్యవసాయ అధికారి బి. వెంకటేష్ తెలిపారు. బుధవారం ఆయన వ్యవసాయ శాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. పంట అవశేషాలను కాల్చడం వల్ల గాలి కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పారు. అలాగే నేలలోని ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశించి, భూమిలో సేంద్రియ కార్బన్ శాతం తగ్గిపోతుందని వివరించారు. దీనివల్ల భవిష్యత్తులో పంట దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

రైతులు పంట అవశేషాలను కాల్చకుండా (Stubble Burning) వాటిని నేలలో కలిపి సేంద్రియ ఎరువులుగా ఉపయోగించాలని ఆయన సూచించారు. అవసరమైతే రోటావేటర్, శ్రెడర్ వంటి యంత్రాలను వినియోగించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ జారీ చేసిన జీఓఎంఎస్ నం.27 (తేదీ: 10-07-2017) ప్రకారం రాష్ట్రంలో చెత్త, వ్యర్థాలను బహిరంగంగా కాల్చడం పూర్తిగా నిషేధించబడిందని ఆయన గుర్తు చేశారు. భూములలో, డంపింగ్ యార్డులలో  లేదా ఇతర ప్రదేశాలలో చెత్త కాల్చడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవని ఆయన హెచ్చరించారు. సాధారణంగా చెత్త కాల్చితే రూ.5,000 వరకు, భారీ స్థాయిలో కాల్చితే రూ.25,000 వరకు జరిమానా విధించబడుతుందని తెలిపారు. ఈ జరిమానాలు సంబంధిత మున్సిపాలిటీ లేదా గ్రామపంచాయతీలు విధిస్తాయని చెప్పారు. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల పరిధిలో చెత్త కాల్చిన సందర్భాలలో  తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి కూడా చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. స్టబుల్ బర్నింగ్‌ను పూర్తిగా నివారించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని జిల్లా వ్యవసాయ శాఖ రైతులను కోరింది.

Read Also: ప్రభుత్వం కీలక నిర్ణయం: 12 మంది తహశీల్దార్లు బదిలీ!

Read Also: డిజిటల్​ విప్లవం

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>