Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రభుత్వం కీలక నిర్ణయం: 12 మంది తహశీల్దార్లు బదిలీ!

కలం, వెబ్‌ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పరిపాలనా అవసరాల దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా 12 మంది తహశీల్దార్లను (Tahsildars) బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి లోకేష్ కుమార్ జీఓ ఆర్టీ నంబర్ 298 ద్వారా ఆదేశాలు ఇచ్చారు. బదిలీ అయిన అధికారులు తక్షణమే తమ పాత బాధ్యతల నుండి రిలీవ్ అయి, కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని స్పష్టం చేశారు.

ఈ బదిలీలలో భాగంగా నిర్మల్ జిల్లాకు చెందిన మోతీరామ్. ఎ ను మంచిర్యాల డీఆర్వోగా నియమించారు. కరీంనగర్ కు చెందిన బి. రాజేశ్వరిని పెద్దపల్లి డీఆర్వోగా, పెద్దపల్లికి చెందిన కే.వై. ప్రసాద్ ను జగిత్యాల డీఆర్వోగా బదిలీ చేశారు. వనపర్తి జిల్లాకు చెందిన ఆర్. పాండును నాగర్‌కర్నూల్ డీఆర్వోగా, ఖమ్మంకు చెందిన వి. రవికుమార్ ను ములుగు డీఆర్వోగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

మేడ్చల్ మల్కాజ్‌గిరికి చెందిన జె. స్వామి కరీంనగర్ డీఆర్వోగా, నాగర్‌కర్నూల్ కు చెందిన ఎ. పాండు కామారెడ్డి డీఆర్వోగా బదిలీ అయ్యారు. జనగామకు చెందిన సీహెచ్. శ్రీకాంత్ ను మహబూబ్‌నగర్ స్పెషల్ కలెక్టర్ పీఏగా నియమించారు. సూర్యాపేటకు చెందిన ఎం. సుదర్శన్ రెడ్డి సిద్దిపేట ఎస్‌డీసీ, ఎల్‌ఏ యూనిట్-2 గా, ఖమ్మంకు చెందిన ఎం. రమాదేవి నల్గొండ ఎస్‌డీసీ, ఎల్‌ఏ యూనిట్-2 గా బాధ్యతలు చేపట్టనున్నారు. పెద్దపల్లికి చెందిన జి. కుమారస్వామి సిరిసిల్ల ఎస్‌డీసీ, ఎల్‌ఏ గా, కరీంనగర్ కు చెందిన ఎన్. వెంకట్ రెడ్డి కరీంనగర్ ఎస్‌డీసీ, ఎల్‌ఏ గా నియమితులయ్యారు. ఈ ఉత్తర్వుల కాపీలను ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్, సంబంధిత జిల్లా కలెక్టర్లకు పంపినట్లు ప్రభుత్వం తెలిపింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>