కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా అశ్వరావుపేట మండలం నారాయణపురం గ్రామంలో శనివారం ఒక అరుదైన వేడుక జరిగింది. ఉపాధి హామీ పనుల క్షేత్రంలో కూలీ దంపతుల పెళ్లి రోజు సంబరాలు (Unique Anniversary Celebration) ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. గ్రామానికి చెందిన ఆకుల శ్రీను, దుర్గా దంపతులు శనివారం ఉపాధి హామీ పనులకు హాజరయ్యారు.
మధ్యాహ్నం పనుల విరామ సమయంలో తోటి కూలీలంతా కలిసి ఈ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకను సంతోషంగా జరిపారు. శ్రీను, దుర్గా దంపతులకు పూల దండలు వేసి, తీపి తినిపించి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. తోటి కూలీలు చూపించిన ఆప్యాయత, అనురాగాలతో ఆ ప్రాంతమంతా పండగ వాతావరణం నెలకొంది. నిత్యం కష్టపడే శ్రమజీవుల మధ్య జరిగిన ఈ వినూత్న వేడుక స్థానికంగా అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.
Read Also: పాల్వంచలో రోడ్డు దుస్థితి.. ప్రయాణం నరకప్రాయం
Follow Us On: Instagram

