కలం, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) సంచలన ప్రకటన చేశారు. ఈ రోజు రాత్రి ఇరాన్‌పై తీవ్ర స్థాయిలో దాడులు జరపబోతున్నట్లు ట్రూత్ వేదికగా వెల్లడించారు. చాలా గట్టిగా ఉండబోతుందని స్పష్టం చేశారు. ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుని.. ఇరాన్ ఆయిల్ నిక్షేపాలను తమ నియంత్రణలోకి తెచ్చుకుంటామన్నారు. అంతేగాకుండా చమురు, గ్యాస్ మార్కెట్లపై అమెరికా పూర్తి స్థాయి పట్టు సాధిస్తుందన్నారు. వెనెజులా ఆయిల్ ఎలాగైతే వెనెజులా, అమెరికాకు ఉపయోగపడుతుందో.. అదే విధంగా ఇరాన్ కూడా ఉండబోతుందని స్పష్టం చేశారు. ట్రంప్ ప్రకటనతో పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది.
హర్మూజ్ జలసంధిలో భయానక పరిస్థితులు..
అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో (Strait of Hormu) పరిస్థితులు భయానకంగా మారాయి. ఓ వైపు ఇరాన్ నౌకాదళం, మరోవైపు అమెరికా తమ సైన్యాలను మోహరించడంతో నౌకల భద్రతలపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే అగ్ర రాజ్యం దాడిలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడమే అమెరికా ఆగ్రహానికి ప్రధాన కారణంగా విశ్లేషిస్తున్నారు.
Read Also: పీవోకేలో పాక్ సైన్యం అరాచకం.. 16 మంది మృతి
Follow Us On : WhatsApp

