ఎవరెస్ట్ అధిరోహించడమే అతడి టార్గెట్

కలం, వరంగల్ బ్యూరో : మారుమూల గిరిజన తండాకు చెందిన ఆ యువకుడు ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా మరిపెడ మండలం భూక్య తండాకు చెందిన భూక్య యశ్వంత్ (Bhukya Yashwanth) ఇటీవల కాలంలోనే మౌంట్ కిలిమంజారో (Mount Kilimanjaro) పర్వతాన్ని అధిరోహించి రికార్డులను సొంతం చేసుకుంటున్నాడు. ఇప్పటివరకు యశ్వంత్ అనుకున్న ప్రతి లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగాడు.

రికార్డుల పర్వం

భూక్య యశ్వంత్ (Bhukya Yashwanth) దేశంలో ఎత్తయిన పర్వతాలను అధిరోహించి తన రికార్డులను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న యశ్వంత్ సైనిక్ స్కూల్లో చదువుతున్నప్పుడు స్కూల్ నుంచి భువనగిరిలో మౌంట్ నీరింగ్ చేయడానికి తీసుకెళ్లారు. అలా మొదలైన అతడి ప్రయాణం నేటికీ కొనసాగుతూనే ఉంది. యశ్వంత్ ఇప్పటివరకు దేశంలో 28 రాష్ట్రాల్లోని 15 ఎత్తైన పర్వతాలను అధిరోహించి తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకున్నాడు. 2021లో ఆఫ్రికాలో అతి ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. అరుణాచల్ ప్రదేశ్ లోని మౌంట్ గోరీచెన్ పర్వతాన్ని ఎక్కిన అతి చిన్న వయస్కుడిగా రికార్డ్ సృష్టించాడు. వచ్చే మార్చిలో అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే, అందుకు దాతల సహకారం అందితే ఎవరెస్ట్ శిఖరాన్ని(Mount Everest) ఎక్కడమే లక్ష్యంగా తన యాత్రను కొనసాగిస్తున్నాడు.

Read Also: నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలు, క్యాన్ల‌తో ఎగబడ్డ జనం!

Follow Us On: Facebook

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>