చిన్నారి నిజాయితీకి మహబూబాబాద్ కలెక్టర్ ఫిదా

కలం, వరంగల్: అంగన్వాడీ చిన్నారి నిజాయితీకి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ (Collector Sneha Shabarish) ఫిదా అయ్యారు. తమ విధుల్లో భాగంగా గంగారం మండలం కొడిశాలమిట్ట (Kodiselamitta) అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలెక్టర్ ముచ్చటించారు.

ఒక చిన్నారి విద్యార్థి నిజాయతీగా చెప్పిన మాటలను కలెక్టర్ వినయంగా విన్నారు. టీచర్ సరిగా పాఠాలు చెప్పడం లేదంటూ కలెక్టర్‌కు చిన్నారి చెప్పాడు. అంగన్వాడీ కేంద్రం ఇప్పుడే తెరిచారని, ఇన్ని రోజులు టీచర్ రాలేదని కలెక్టర్‌కు వివరించాడు. తనకు ఏబీసీడీలు, అఆఇఈలు మాత్రమే వచ్చంటూ చిన్నారి తెలిపాడు.

చిన్నారి నిజాయితీకి మెచ్చిన కలెక్టర్ స్నేహ శబరీష్.. బాలుడికి బహుమతి అందజేశారు. ఊహించని బహుమతి ఇవ్వడంతో చిన్నారి ఆనందంలో మునిగిపోయాడు. సదరు అంగన్వాడీ టీచర్ నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>