ఎండలో స్కూల్ పిల్లలు.. కలెక్టర్ సీరియస్ వార్నింగ్

కలం, వెబ్ డెస్క్: మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరీష్ (Sneha Sabareesh) విద్యా శాఖ అధికారులపై సీరియస్ అయ్యారు. ఓ పాఠశాలను తనిఖీ చేసేందుకు వెళ్లిన కలెక్టర్‌కు తనకు స్వాగతం చెప్పేందుకు స్కూల్ పిల్లలు ఎండలో నిల్చోవడాన్ని గమనించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోసారి విద్యార్థులను ఇలా ఎండలో తన కోసం నిల్చోబెడితే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ సందర్భంగా అక్కడున్న పిల్లలను వెంటనే లోపలికి వెళ్లిపోవాలని సూచించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కలెక్టర్ చేసిన పనికి నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. విద్యా శాఖ అధికారుల ఓవరాక్షన్‌కు కలెక్టర్ గట్టి వార్నింగ్ ఇచ్చారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు క్లాస్ రూంలో ఉండాల్సిన విద్యార్థులను ఎందుకు ఎండలో నిలబెట్టారంటూ విద్యా శాఖ అధికారులను తప్పుబడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>